కూకట్‌పల్లిలోనందమూరి సుహాసిని ఓటమి.

ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహంతో కూకట్‌పల్లి నియోజకవర్గంలో మహా కూటమి అభ్యర్థిగా రంగంలోకి దిగిన నందమూరి సుహాసిని ఓటమి పాలయ్యారు. టిఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణరావు సుహాసినిపై విజయం సాధించారు. సుహాసిని టిడిపి మాజీ ఎంపీ దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె కావడంతో కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక ప్రత్యేకత సంతరించుకుంది.

ఏపీ సీఎం చంద్రబాబు సహా, బాలకృష్ణ తో పాటు పలువురు తెదేపా నేతలు ఆమెకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ నందమూరి సుహాసిని ఓటమిపాలైంది. ఆమె ప్రచారంలో ఎన్టీఆర్ పాల్గొంటారని భావించినప్పటికీ ఆయన కేవలం మద్దతు ప్రకటించారు. ప్రచారంలో భాగంగా కేటీఆర్ నందమూరి కుటుంబాన్ని రాజకీయంగా అణగదొక్కడానికి సుహాసిని రంగంలోకి దించారు అంటూ విమర్శలు కురిపించిన విషయం తెలిసిందే.