సత్తా చెప్పిన భారత బౌలర్లు. ఆసీస్ 235 ఆల్ అవుట్.

పూజారా పోరాటానికి బౌలర్ల మద్దతు తోడవడంతో మొదటి టెస్ట్ ఆసక్తికరంగా సాగుతుంది. భారత అగ్రశ్రేణి బ్యాటమెన్స్ తరహాలోనే ఆస్ట్రేలియా బ్యాటమెన్స్ కూడా వరుసగా పెవిలియన్ బాట పట్టారు. భారత్ ను పూజారా ఆదుకున్నట్టే ఆస్ట్రేలియాను ట్రావిస్ హెడ్ ఆదుకున్నాడు. దీంతో రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 191 పరుగులు చేసింది.

భారత్ ను తొలి ఇన్నింగ్స్ లో 250 పరుగులకే పరిమితం చేసిన ఆస్ట్రేలియాకు మొదటి ఓవర్ లోనే షాక్ ఇచ్చాడు ఇషాంత్. ఫించ్ ను డక్ అవుట్ గాపంపించాడు.ఇక అశ్విన్‌ ఆసీస్‌ టాప్‌ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. మిడిలార్డర్‌లో ట్రావిస్‌ హెడ్‌ (61*) ఒక్కడే ఆస్ట్రేలియా ను ఆదుకున్నాడు. హ్యాండ్స్‌కోంబ్‌ 34 పరుగులు సాధించాడు. అశ్విన్‌ మూడు వికెట్లు, ఇషాంత్‌, బుమ్రా రెండేసి వికెట్లు సాధించారు.

ఇక మూడో రోజు ఆట మొదలయ్యే సమయానికి 60 పరుగులు వెనుకబడి ఉన్న ఆస్ట్రేలియా మరొక 45 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. ట్రావిస్ హెడ్ రెండో రోజు స్కోర్ (61) కి మరొక 11 పరుగులు సాధించి 72 పరుగులు వద్ద అవుట్ అయ్యాడు. మూడవ రోజు ఆటలో మిగిలిన ఆస్ట్రేలియా వికెట్లను బుమ్రాహ్ (1) షమి (2) సాధించడంతో ఆసీస్ 235 పరుగులకే ఆలౌట్ అయింది. ఆట వర్షం అంతరాయం కలిగింది. మూడో రోజు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో లంచ్ సమయాన్ని కొంచెం ముందుకు జరిపారు.