పూజారా సెంచరీతో నిలిచిన భారత్. ఆస్ట్రేలియాతో మొదటి టెస్టులో భారత్ 250/9.

భారత్ తన బలహీనతను మళ్లీ బయటపెట్టుకుంది. విదేశాల్లో మొదటి టెస్టులో మొదటగా బ్యాటింగ్ చేసేటప్పుడు పెవిలియన్ కు క్యూ కట్టే సాంప్రదాయాన్నిభారత్ మరోసారి పాటించింది. ఆస్ట్రేలియా అగ్రశ్రేణి బ్యాట్స్మన్ స్మిత్, వార్నర్ ల నిషేధంతో కొంచెం వన్నె తగ్గిన ఆస్ట్రేలియా జట్టుపై భారత్ పై చేయి సాధిస్తుందని ఆశించిన అభిమానులకు షాక్ ఇస్తూ ఆసీస్ ఎప్పట్లానే విరుచుకుపడింది. అతి తక్కువ స్కోర్లకే భారత అగ్రశ్రేణి బ్యాట్స్మన్లను పెవిలియన్ బాట పట్టించింది. చటేశ్వర్ పుజారా కనక ఆదుకోకపోయి ఉంటే భారత్ దారుణమైన స్కోరుకే ఆలౌట్ అయి ఉండేది.

అడిలైడ్‌ హలో జరిగిన మొదటి టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కు ఆస్ట్రేలియా బౌలర్లు చుక్కలు చూపించారు. రాహుల్‌ (2), విజయ్‌ (11), కోహ్లి (3), రహానె (13) విఫలమైనప్పటికీ చతేశ్వర్ పుజారా అండతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. మిగతా బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేసినా.. పుజారా (123) అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ గౌరవప్రదమైన స్కోర్ ను సాధించింది. స్టార్క్‌, హేజిల్‌వుడ్‌, కమిన్స్‌, లైయన్‌లు రెండేసి వికెట్లు సాధించారు.

వరుస వికెట్ల పతనంతో భారత్ స్కోరు ఒక దశలో 127/6 గా వుంది. ఆ స్థితి నుంచి భారత్ 250 పరుగుల స్కోర్ సాధించడానికి కారణం పుజారా సహనమే. పుజారా ప్రశాంతంగా ఆడుతూ అశ్విన్‌ (25) భారత్ ఇన్నింగ్స్‌ కు మరమ్మతు చేశాడు. ఆ క్రమంలో సెంచరీ సాధించిన పూజారా ఆట చివరిలో రనౌటయ్యాడు. భారత్ అగ్రి శ్రేణి బ్యాట్స్ మెన్ అందరు ఇవ్వడానికి కారణం భారత బ్యాట్స్ మెన్ ల స్వయంకృతమేనని, అనవసరమైన షాట్లతో వికెట్లు సమర్పించుకున్నారు భారత మాజీలు టీమిండియా ఫై విమర్శలు కురిపించారు.