వరల్డ్ కప్ హాకీ మొదటి మ్యాచ్ లో భారత్ విజయం.

స్వదేశంలో జరుగుతున్న హాకీ ప్రపంచకప్ లో భారత్ దూకుడు ముందు సౌత్ ఆఫ్రికా నిలవలేకపోయింది. మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం కనబర్చిన భారత జట్టు ఆటగాళ్లు 5-0 తేడాతో తమ మొదటి మ్యాచ్ గెలిచి టోర్నీలో శుభారంభం చేశారు. మ్యాచ్ తొమ్మిదవ నిమిషంలోనే మన్‌దీప్ సింగ్ గోల్ సాధించి, ఖాతా తెరిచాడు. 12వ నిమిషంలో ఆకాశ్ దీప్ మరో గోల్ సాధించడంతో తొలి సగం ఆట ముగిసే సమయానికి భారత్ 2-0 ఆధిక్యంతో నిలిచింది. మ్యాచ్ రెండవ భాగంలో దక్షిణాఫ్రికా కొంచెం పుంజుకున్నప్పటికీ భారత్ వెంటవెంటనే గోల్స్ చేసి 5-0 తిరుగులేని ఆధిక్యం సాధించింది.

బుధవారం జరిగిన మరో మ్యాచ్‌లో బెల్జియం, కెనడాపై 2-1 తేడాతో విజయం సాధించింది. భారత్ తన తర్వాతి మ్యాచ్‌ డిసెంబర్ 2న బలమైన బెల్జియం జట్టుతో తలపడనుంది.