ఒడిషా వేదికగా ప్రపంచ హాకీ సమరం మొదలు..!

హాకీ ప్రపంచ కప్ సమరానికి తేర లేచింది. ఒడిషా వేదికగా నేటి నుండి హాకీ ప్రపంచకప్‌కు ఆరంభం కానుంది. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ మంగళవారం టోర్నీని అధికారికంగా ప్రారంభించారు. మొత్తం 19 రోజుల పాటు 16 జట్ల మధ్య ఈ సమరం సాగనుంది.

ప్రపంచకప్‌ ఆరంభోత్సవ సంబరం మంగళవారం జరిగింది. ఈ వేడుకల్లో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌, మాధురీ దీక్షిత్‌ లు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఏఆర్‌ రెహమాన్‌ ఆర్కెస్ట్రా అభిమానులను మైమరపించింది.

ఆరంభ మ్యాచ్ గా దక్షిణాఫ్రికాతో నేడు ఆతిధ్య భారత్ తలపడనుంది. రాత్రి గం. 7 లకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి రోజు బెల్జియంతో కెనడా మ్యాచ్ కూడా ఉంది. మొత్తం 36 మ్యాచ్‌లు జరిగే ఈ ప్రపంచ కప్ లో భారత్‌, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, నెదర్లాండ్స్‌, జర్మనీ జట్లు ఫేవరేట్ గా బరిలోకి దిగుతున్నాయి.

కెప్టెన్‌ మన్‌ప్రీత్‌సింగ్‌ సారథ్యంలోని మంచి ఫామ్‌లో వున్న భారత జట్టు 43 ఏళ్ల సుదీర్ఘ ఏళ్ల తర్వాత కప్ సాధించాలనే కసితో ఉంది.