మన సుందరానికి (ముద్దులబ్బాయికి) తొందరెక్కువ…

పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్లిళ్లు చేసికొన్నాడు కాబట్టి రాజకీయాలకు పనికిరాడు. నేను ఒక్కటే పెళ్లి చేసికొన్నాను కాబట్టి నేను రాజకీయాలకి పనికొస్తాను అనే మన జలగన్న మిడి మిడి జ్ఞానపు నీతులు వింటుంటే “వీళ్ళ చేతుల్లో నలిగిన లెక్కలేని మల్లెలు నవ్వుకొంటాయి అని జలగన్నకి తెలియదా? తెలియకపోవచ్చు. ఎంతైనా మన సుందరానికి తొందరెక్కువ కదా!

చేతకాని మొగుడు పక్కలో ఉన్నా ఒక్కటే, బొక్కలో ఉన్నా ఒక్కటే అన్నట్లు, ప్రజలకి గుక్కెడు గంజినీళ్ళు కూడా పోయని జలగన్నలాంటి “లోభి” ఒక్కటే పెళ్లి చేసికొన్నా లేక పెళ్లి చేసికోకపోయినా ప్రజలకి ఒరిగేది ఏమి లేదు. ప్రజలకి గంజినీళ్ళు పోయడం కోసం తన “బెంజి కారులు కూడా అమ్మే పవన్ లాటివాళ్ళు మూడు పెళ్లిళ్లు చేసికొన్న లేక నాలుగు పెళ్లిళ్లు చేసికొన్నా సమాజానికి వచ్చే నష్టం లేదు. ప్రజల రక్త మాంశాలతో పెళ్ళానికి వడ్డాణాలు, బంగ్లాలు కొనిచ్చే నాయకుడు వల్ల ప్రజలకి ప్రయోజనం లేదు అని మన జలగన్నకి తెలియదా? తెలియకపోవచ్చు.ఎంతైనా మన సుందరానికి తొందరెక్కువ కదా!

తన తోబుట్టువు అధికారికంగానే రెండు పెళ్లిళ్లు చేసికొన్నది. అప్పుడు తన తండ్రికి గాని, తల్లికిగాని లేదా తనకిగాని దాంపత్య విలువలు గుర్తుకి రాలేదా? జలగన్న కృష్ణ జన్మస్థానంలో ఉన్నపుడు పార్టీ సారధ్యం తోబుట్టువే కదా వహించింది. వారి తండ్రులు, తరువాత వారు ముఖ్యమంత్రులు అయిపోవచ్చా? అప్పుడు కుటుంబ విలువలు, దాంపత్య విలువలు గురుతుకు రాలేదా? పవన్ కల్యాణకేనా విలువలు వర్థించేది? కడుపు చించుకొంటే కాల్లమీదే పడుతుంది అనేది మన జలగన్నకి తెలియదా? తెలియకపోవచ్చు. ఎంతైనా మన సుందరానికి తొందరెక్కువ కదా!

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసికొన్నారు అనేది జగమెరిగిన సత్యం. కానీ నాలుగు పెళ్లిళ్లు చేసికొన్నాడు అని మన జలగన్న అంటున్నారు. నాలోగోపెల్లి నువ్వు చేసికొన్నావా లేక నీ బంధువులు చేసికొన్నారా అంటూ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టింగ్స్ చూస్తుంటే నాకే సిగ్గెస్తున్నది. మరి మన జలగన్న ఆలోచించకుండా అలా ఎందుకు నోరు జారుతున్నారో? జలగన్నకి సిగ్గుగా లేదా? లేకపోవచ్చు. ఎంతైనా మన సుందరానికి తొందరెక్కువ కదా!

జలగన్నా! పెళ్ళాన్ని ప్యాలస్’లో ప్రియురాళ్లని పెరట్లో పెట్టుకొనేవాడే రాజకీయనాయకుడు అవుతాడు కానీ మూడు పెళ్లిళ్లు చేసికొనేవాడు రాజు కాలేడు అని ఏ శాస్త్రాల్లో చెప్పారు? హిందూ ధర్మల్లోనా? క్రిస్తవ గ్రంధాల్లోనా? లేక ముస్లిం ఖురాన్లోనా? లేక హిందూ వివాహ చట్టంలోనా? పవన్ కళ్యాణ్ చట్టప్రకారం విడాకులు ఇచ్చే పెళ్లిళ్లు చేసికొన్నారు గాని డబ్బులు వెదజల్లి “శ్రేయ’స్సు” కోసం అంటూ సెలెబ్రిటీలను తెచ్చుకోలేదుగా అనేది మన జలగన్నకి తెలియదా? తెలియకుండానే నోరు జారేసాడా? అవ్వచ్చు. ఎంతైనా మన సుందరానికి తొందరెక్కువ కదా!

కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అన్నట్లు పవన్ కళ్యాణ్ భార్యలకు లేని భాధ మన జలగన్నకు ఎందుకు. భార్య భర్తల భాధలు ఉంటే కోర్టులు పరిష్కరిస్తాయి. రాష్ట్రంలో వున్న ప్రజల సమస్యలు వదిలిసి, అసెంబ్లీ వదిలేసి పవన్ కల్యాణ పెళ్లిళ్ల గొడవ మన జలగన్నకి ఎందుకు. ఒకవేళ పరిష్కరించాలి అంటే ముందు వాళ్ళ ఇంటిలో చేసికొన్న రెండుపెళ్ళిళ్ల గొడవ తీర్చాలిగా అనేది మన జలగన్నకి తెలియదా? తెలియకపోవచ్చు. ఎంతైనా మన సుందరానికి తొందరెక్కువ కదా!

మన సుందరానికి ఎప్పుడూ తొందరెక్కువే. చదివేటప్పుడు పేపర్ వచ్చేవరకు ఆగలేడు. తండ్రి పార్థివ దేహం ఉన్నంత వరకు అయినా సంతకాలు తీసికోకుండా ఉండలేడు. అంతెందుకు నేను ముఖ్యమంత్రిని దిపేస్తున్నాను అని నోరు జారాడు. మొత్తం తన వర్గపు ఎమ్మెల్యేలను బాబు చేతిలో పెట్టేసాడు. బాబు స్కామ్లు చేయకుండానే విమర్శలు చేయడం మొదలు పెట్టడం, దానితో బాబు సర్దుకోవడం మనకి తెలిసినదే. ముద్రగడ ఊరి వెళ్లి కాపుల్ని తిట్టడం. తెలంగాణాలో కాంగ్రెసుకే నా మద్దతు అని నోరు జారడం. ఆబ్బె లేదు అంటూ మరల మాట మార్చడం. ఇంత నోటి దుసుర్సు అవసరామా సుందరం?

సుందరం! తొందరపడి ఇలానే మాటలు జారుతుంటే, “చీఫ్ మినిస్టర్” కాదు కదా “చీపురు మినిస్టర్” కూడా కాలేవు. ఎంతైనా మన సుందరానికి తొందరెక్కువ అనే ముద్ర పోగొట్టుకో… ప్రజల పొట్టలు నింపే నిస్వార్ధ నాయకుడు కానాలి గాని పెళ్లిళ్లతో ప్రజలకి సంబంథం లేదు అని గ్రహించు. నీలో స్వార్ధం ఉన్నదా లేదా అనేది ఆలోచించు. పెళ్లిళ్ల గురుంచి కాదు.

ఆలోచిద్దాం…. ఏది నిజం ఏది అబద్దం

article by:- narayana.I