నేనుసైతం జనసేనుడి కవాతు కోసం ఒక్క రోజుని ధార పోస్తాను!!! నేను సైతం కవాతు కోసం అశ్రువొక్కటి ధార పోస్తాను!!!

పాలకుల పల్లకీలు మోస్తున్నది మనం. వారికి గొడ్డు చాకిరి చేస్తున్నది మనం. చాకిరేవు పెడుతున్నది మనం. వారికి గుడ్డలు, చెప్పులు కుట్టేది మనం. వారు చస్తే పార్థివ దేహానికి కడకంటూ కాలేవరకు కాపలాగా ఉండేది మనం. కానీ మన భాధితుల కన్నీటిగాధలు పాలకులకి, వారి దుష్టపరివారానికి పట్టవా? అందుకే పవన్ ప్రపంచం-పవన్ ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పోదాం కవాతుకు.

బాధితుల ఆక్రందనలు వినడంకోసం, పేదవాడిఆకలిని తీర్చడంకోసం, అణచివేయబడ్డ వర్గాల దీనాఅవస్థలను లేకుండా చేయడంకోసం, అన్నివర్గాలను, ఒకటి రెండు వర్గాలు దోపిడీచేస్తూ ఉండడాన్ని నిరోధించడంకోసం

నేనుసైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిఇచ్చాను, నేనుసైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారాపోసాను అంటూ వస్తున్న జనసేనుడుతో కదం తొక్కుతూ పదం పాడుతూ కవాతు కోసం జనశ్రేణల వెంట పోదాము.

కుదిరితే జనసేనునితో పరిగెడదాం. లేకపోతే వెంట నడుద్దాం. అధీ చేతకాకపోతే మార్పుకోసం వస్తున్న జనసేనుడి వెంట పాకుతూ అయినా పోదాం. అంతేకానీ భ్రష్టాచారులకి, దోపిడీ దారులకి పల్లకీ మోస్తూ మాత్రము ఉండం.

పతితులారా, బ్రస్థులారా, బాధా సర్పధస్థులారా ఏడవకండి ఏడవకండి ఏడవకండి. మీభాధలు, మీగాధలు నేను ఎరుగుదను అంటూ వస్తున్నాయి వస్తున్నాయి జనసేనుని రధ చక్రాలు కవాతు కోసం వస్తున్నాయి.

దోపిడీదారులు, భ్రష్టాచారులు, పాతుకుపోయిన నిరంకుశ పాలకులు, విలువలులేని ప్రచార సాధనాల అధిపతులు, గతి తప్పిన వారి అంనుంగ పరివారము, జనసేనుని రధచక్రాల కింద నలిగిపోవడం ఖాయం. ఇదినిజం. ఈలోకం మనదేనండి. మీరాజ్యం మీరు ఏలండి. మీస్వప్నం నిజమవుతుంది. మీస్వర్గం రుజువు అవుతుంది.

ఆలోచించండి!!! తరాలు మారుతున్నా తలరాతలు మారవా? ఇంకెన్నాళ్లు పల్లకీ మోత?

article by:- narayana.I