ముసుగు తీసేసిన హీరో శివాజి

ప్రారంభంలో బీజేపీని, మోదీనీ, వెంకయ్య నాయుడునీ పొగడ్తలతో ఆకాశానికెత్తి, కాంగ్రేసోళ్లను బండబూతులు తిట్టి, ఆంధ్రప్రదేశ్ కు న్యాయమంటూ జరిగితే బీజేపీ వలనే జరుగుద్దంటూ నానాయాగీ చేశాడు హీరో శివాజి.

శివాజీ మొదట్లో వైసీపీ మీదా, ఓ మోస్తరుగా టీడీపీ మీదా విమర్శలు చేశాడు. అయితే అధికారంలోకి వచ్చాక బీజేపీ ఇచ్చిన హామీని విస్మరించినా, రెండుమూడేళ్లు నిశ్శబ్ధంగా ఉన్న శివాజీ, వారిమధ్య ఏమి పొరపొచ్చాలు వచ్చాయో ఏమో తెలీదుగానీ బీజేపీని , మోదీని విమర్శించడం ప్రారంభించాడు.

చిన్న చిన్న నిరసన కార్యక్రమాలతో కూడా మీడియా ఎదుట హడావిడి చేశాడు. ఈ క్రమంలో చంద్రబాబుకు దగ్గరవుతూ, ఇతర పార్టీ నాయకులందరినీ దుమ్మెత్తి పోశాడు.

మొన్నామధ్య బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తుందనీ, అందులో పవన్ కళ్యాణ్ పావు కాబోతున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దానికి ప్రతిస్పందనగా బీజేపీ నేతలు శివాజీని ఫుట్ బాల్ ఆడేసుకోవడం అందరికీ తెలిసిందే.

గతంలో శివాజీ మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో ఏపీ ఈ దేశం లోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా మారిందని, ఈ ఆంధ్ర రాష్ట్రం గతంలో ఇంత అవినీతిని ఎరుగదనీ అన్నాడు. మళ్లీ ఏమైందో ఏమో, వెంటనే కొన్ని రోజుల తరువాత చంద్రబాబు పరిపాలన బాగానే ఉందని, అవివీతి అన్నిచోట్లా ఉండేదే అని, మనందరం అవినీతి పరులమే అనీ వ్యాఖ్యానించాడు.

మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ని చిత్తుగా ఓడించాలనీ, ఓడిస్తేనే దక్షిణ భారతదేశానికి ప్రయోజనం అనీ అన్నాడు.పవన్ కళ్యాణ్ బైటకి వచ్చి ఉద్యమం చేస్తే ప్రత్యేక హోదా వస్తుందని పలుమార్లు ప్రెస్ మీట్ లలో చెప్పాడు శివాజి. తీరా పవన్ బైటకు వచ్చి గుంటూరు లో బహిరంగ సభ పెట్టి, ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం, నిరాహారధీక్షకు కూర్చుంటానని తెలిపాడు. అయితే అప్పటి వరకూ ఊహించని ఈ హఠాత్పరిణామానికి ఖంగుతిన్న పచ్చవర్గం శివాజీతో పవన్ పై పలు విమర్శలు చేయించింది. ఆపరేషన్ గరుడ / ఆపరేషన్ ద్రావిడ అంటూ బీజేపీ పవన్ ను సీయం చేయాలని చూస్తోందంటూ పలు వ్యాఖ్యలు చేశాడు.

ఇక్కడే రాష్ట్ర ప్రజలందరికీ శివాజీ బతుకేంటో తేటతెల్లం అయింది. అప్పటి వరకూ పవన్ సినిమాలు చేసుకుంటాడులే, బైటకు రాడులే అనుకుని, పవన్ రావాలి పవన్ రావాలి అంటూ మాట్లాడిన పచ్చవర్గం వక్కసారిగా పవన్ గుంటూరు బహిరంగ సభలో హోదాకోసం ఆమరణ ధీక్షకి సిద్ధమని ప్రకటించడతో , అందరికీ వొణుకు మొదలై పిచ్చి కూతలు కూశారనేది బహిరంగ సత్యం.

నిజంగా శివాజీకి రాష్ట్రంపై ప్రేమే ఉంటే, ప్రత్యేక హోదా గురించే మాట్లాడాలిగానీ, తనకు సంబంధం లేని విషయాల గురించి ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ పెరుగువడ అంటూ పిచ్చిమాటలెందుకు?
బీజేపీ పవన్ కళ్యాణ్ ను సీయం చేసే ఉద్ధేశ్యం గురించి శివాజీకెందుకు??

ఇక్కడే అర్ధం అయింది అతడికి కావల్సింది ప్రత్యేక హోదా కాదు, ఇంకేదో అని. ఇన్నాళ్లూ శివాజీ ఆడిన డ్రామా బహిర్గతం కావడంతో, ముసుగు తీసేసి, పబ్లిక్ గానే టీడీపీకి సపోర్టుగా మాట్లాడుతూ, పచ్చమీడియా అధిపతులతో కూడా చెట్టా పట్టాలేస్కుని తిరుగుతుండటం అందరికీ తెలిసిన విషయమే.

ఇలాంటి వ్యక్తే ఇంకోకరు ఉన్నారు, ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు.ఆయన తానసలు ప్రభుత్వ ఉద్యేగిననే సంగతే మరిచిపోయి , టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తుంటాడు.

ఇలా శివాజీ, అశోక్ బాబు లాంటోళ్లు ఏదోక హడావుడి చేసి, తమ స్థాయికి మించినోళ్లను విమర్శలు చేసి, నాయకులుగా ఎదిగి టీడీపీలో సెటిల్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు.

Article by డా|| కేపి