కుల ముద్రపడుతుందంటూ విషంగక్కిన పచ్చ మీడియా…

“జనసేన”లోకి జేడీ రాడు వస్తే కుల ముద్ర పడుతుంది” అంటూ తన వీకెండ్ కామెంట్లో పచ్చ విషం కక్కిన ఈ మీడియా అధినేతలకు ఏమైనా కాసింత సిగ్గు, లజ్జ, జర్నలిజం విలువలు అయినా ఉన్నాయి అంటారా?

అన్న ఎన్టీఆర్, నాదేండ్ల, కలిసి పార్టీ పడితే దానికి కులముద్ర పడనివ్వరు. భానోజీ రావు లాంటి కుల ప్రముఖులు ఆ పచ్చ పార్టీకి బహిరంగ మద్దతు ఇస్తే కుల ముద్ర పడనివ్వరు. ఆ పచ్చ పార్టీలోకి దొడ్డిదారిలో చంద్రలోకాధీశుల వారు ప్రవేశిస్తే ఆ పచ్చ పార్టీకి కుల ముద్ర రానివ్వరు? ఈ ఆర్కే టీవీ అధినేతతో పాటు ఈ కుల గజ్జోళ్ళు తమ గజ్జిని పక్కోళ్లకి అంటించాలని చూస్తున్నారు?

పురుషాధిక్యముతో ఒక మహిల పెత్తనము సహించలేక, అన్న ఎన్టీఆర్’ని పదవీచుత్యుడిని చేస్తే కుల ముద్ర పడనివ్వరు సరికదా ఈ చంద్రలోకాధీశుల వారు “మహిళా వ్యతిరేకి” అనే ముద్ర కూడా పడనివ్వరు. ఎందుకంటే మొత్తము మీడియా ఈ కుల గజ్జోళ్ళు చేతిలో ఉన్నదీ కాబట్టి?

తనయుడిని మంత్రిని చేసికొన్న గాని, బావమర్దికి ఎమ్మెల్యే చేసినా గాని, నంది అవార్డులను ఒక్క తన కులపోళ్ళకే ధారపోసిన గాని, పన్ను మినహాయింపులు తన కులపోళ్ల సినిమాలకు మాత్రమే ఇస్తున్నాగాని, మహానటి లాంటి గొప్ప మానవతావాది జీవిత చరిత్రకి కూడా కుల గజ్జి అంటించినా గాని చంద్రలోకాధీశుల వారికి కుల ముద్ర వేయరు.

జనాభాలో వీరి శాతము 5.6. కానీ సీఎం, స్పీకర్, డీజీపీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, మెజారిటీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్య సభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఇంచార్జిలు, కార్పొరేషన్ చైర్మన్లు జడ్జెస్, లాయర్స్, మీడియా, సినిమా రంగము, కాంట్రాక్టులు, వ్యాపారాలు, ముసుగు మేధావులు, ముసుగు మహిళా సంఘాలు, జిల్లాలు, తాలూకాలు, మండలాధీశులు అన్ని (జనాభాకి మించి ఎన్నో రెట్లు) ఈ ఒక్క కులం నుండే ఉంటున్నాగాని చంద్ర లోకాధీశుడికి కుల ముద్ర వేయరు. కానీ మన పచ్చ కుల గజ్జి మీడియా జన సేనుడికి, జేడీ, లేదా దళిత, వెనుకబడిన కులాలనుండి వస్తున్న నాయకులము మాత్రమే కుల ముద్ర వేసేస్తారు? మిగిలిన వారు వీళ్ళ మోచేతి కింద నీళ్లు మాత్రమే తాగాలి?

దేనికోసము వీరి కుల గజ్జి ప్రచారము? వీళ్ళ అరుపులకి, భేదిరింపులకి భయపడి మనమందరము అడుక్కొని తినాలనా? లేకా వీళ్ళ బూట్లు తుడుస్తూ, పల్లకీలు మోస్తూనే ఉండాలనా?

Article by Narayana.I