మిజోరం ఎంఎన్ఎఫ్‌ కైవసం.

ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మిజోరంను కాంగ్రెస్‌ చేజార్చుకుంది. మిజో నేషనల్‌ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్‌)‌ స్పష్టమైన మెజార్టీ సాధించి అధికార పగ్గాల్ని చేపట్టేందుకు సిద్ధమైంది. 40 స్థానాలున్న మిజోరంలో ఎంఎన్ఎఫ్‌ 26 సీట్లు గెలిచి ఏకపక్ష విజయాన్నిసాధించింది. కాంగ్రెస్ కేవలం 5 సీట్లకు పరిమితం కాగా, బీజేపీ 1 స్థానాన్ని గెలిచింది. దీంతో ఇక్కడ పదేళ్ల కాంగ్రెస్‌ పాలనకు తెరపడినట్టయ్యింది. ఎంఎన్ఎఫ్‌ అధినేత జోరంతాంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నారు. ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మణిపూర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ, నాగాలాండ్‌, త్రిపుర రాష్ట్రాలు ఇప్పటికే కాంగ్రెస్ చేతుల్లోంచి వెళ్లిపోగా మిగిలిన ఏకైక రాష్ట్రమైన మిజోరాంలో కూడా కాంగ్రెస్ అధికారం కోల్పోయింది.