రాజస్థాన్, చత్తీస్ ఘడ్ కాంగ్రెస్ కైవసం.

రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలో అధికార బిజెపిపై కాంగ్రెస్ పార్టీ పై చేయి సాధించింది. రాజస్థాన్‌ అసెంబ్లీ ఫలితాలలో కాంగ్రెస్ మ్యాజిక్ మార్కును సొంతం గానే సాధించింది. 100 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. బీజేపీ 73 స్థానాలకే పరిమితం అయ్యింది. బి ఎస్ పి ఆరు సీట్లు సాధించగా ఇతరులు 20 స్థానాల్లో గెలుపొందారు. రాజస్థాన్‌ లో మొత్తం 200 స్థానాలుండగా బీఎస్పీ అభ్యర్థి ప్రాణాలు కోల్పోవడంతో 199 స్థానాలకు పోలింగ్‌ జరిగింది.

ఇక చత్తీస్ ఘడ్ లో విస్పష్ట మెజారిటీ సాధించి అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 90 స్థానాలకు గాను 68 స్థానాల్లో విజయం సాధించి అధికార బిజెపిని కేవలం 16 స్థానాలకు పరిమితం చేసింది. అజిత్ జోగి, మాయావతి కూటమి జెసిసి కేవలం 6 స్థానాలతో సరిపెట్టుకుంది. గత పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్నబిజెపిని గద్దె దించి ఛత్తీస్‌గఢ్‌ లో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా చత్తీస్గడ్ పిసిసి అధ్యక్షుడు సీనియర్‌ నేత భూపేశ్‌ భగేల్‌ పేరు వినిపిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి తనదే నైతిక బాధ్యత అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ తెలిపారు.