బాలయ్య ఎవరో నాకు తెలీదండీ బాబు..! బాలయ్య పై పంచ్ విసిరిన నాగబాబు.

హీరో బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మెగా బ్రదర్ నాగబాబు. ఒక ఇంటర్వ్యూ లో భాగంగా ఆర్జీవి, బాలయ్య పై తన అభిప్రాయం చెప్పాలంటూ కోరగా.. ఆ జీవి గురించి చెప్పడానికి ఏమీ లేదు అతనిపై 150 ఫంక్షన్ లోనే చెప్పాను అన్నారు. ఇక బాలయ్య గురించి అడగ్గా.. మొదట ‘‘బాలయ్య ఎవరో నాకు తెలియదు, ఐయామ్ వెరీ సారీ. అని స్పందించి.. మళ్లీ బాలయ్య గారు చాలా పెద్ద ఆర్టిస్టు. సీనియర్ మోస్ట్… నేరము శిక్షలో కృష్ణగారు, ఆయన కలిసి యాక్ట్ చేశారు” అని సినీయర్ నటుడు బాలయ్య గురించి చెప్పుకొచ్చారు.

మేము అడిగేది నందమూరి బాలకృష్ణ గురించి అని యాంకర్ అడగ్గానే…‘నేనెప్పుడూ ఆయన పేరు వినలేదు. నెక్ట్స్ క్వశ్చన్ ప్లీజ్’ అంటూ స్పందించారు. సాధారణంగా పరిశ్రమలో ఎవరినీ నొప్పించడానికి ఇష్టపడని మెగా ఫ్యామిలీలో బాలకృష్ణ పై నాగబాబు ఈ విధంగా స్పందించడం సంచలనం రేపుతోంది. మహేష్ బాబు పై స్పందించిన అడగగా.. “కళ్యాణ్ బాబుకు సమానమైన వ్యక్తి మహేష్ బాబు” అన్నారు. ప్రిన్స్ అనే మాటకు సరైన వ్యక్తి మహేష్ బాబు అంటూ ప్రశంసలు కురిపించారు.