కరణ్ జోహార్ తో కాఫీ తాగిన బాహుబలి టీం…!

కరణ్ జోహార్ హోస్ట్ గా నిర్వహిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ ప్రోగ్రాంలో త్వరలోనే మన బాహుబలి టీమ్ దర్శనమివ్వనుంది. దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న ‘కాఫీ విత్ కరణ్’ షో విజయవంతంగా ఆరవ సీజన్ నడుస్తోంది. ఎక్కువగా నార్త్ ఇండియన్ సెలబ్రెటీలతోనే ఈ షో నిర్వహించే కరణ్ జోహార్ తాజాగా మన బాహుబలి టీంతో ఈ షోలో ఒక ఎపిసోడ్ నిర్వహించాడు. ఇందులో రాజమౌళి, ప్రభాస్, రానా కరణ్ జోహార్ తో కాఫీ తాగుతూ ముచ్చటించారు. ఈ షో త్వరలోనే ప్రసారం కానున్నట్టు కరుణ్ జోహార్ తన ట్విట్టర్ లో ప్రకటించాడు.

దేశ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించిన బాహుబలి హిందీ వెర్షన్ కు కరణ్ జోహార్ నిర్మాత కావడంతో బాహుబలి టీం తో మంచి పరిచయం ఏర్పడింది. దానితో ఈ సెలబ్రిటీ టాక్ షోలో మన మన తెలుగు సెలబ్రిటీలకు అవకాశం లభించింది. ప్రతి ఆదివారం రాత్రి 9గంటలకు స్టార్ వరల్డ్ ఛానల్లో ఈ షో ప్రసారమవుతుంది.