పవన్ ని దింపేసిన శింబు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ అత్తారింటికి దారేది తమిళంలో డైరెక్టర్ సి. సుందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శింబు హీరోగా ‘వంత రాజవత్తాన్ వరువేన్’ పేరుతో రూపొందిన ఈ సినిమా టీజర్ శనివారం రిలీజ్ అయ్యింది. అయితే ఈ చిత్రంలో డైరెక్టర్ సుందర్ పూర్తిగా పవన్ కళ్యాణ్ మేనరిజంనే హీరో శింబుతో చేయించడం సినీ వర్గాలను ఆశర్యపరుస్తోంది. హీరో శింబుకు తమిళంలో మంచి క్రేజ్ తో పాటు తనకే సొంతమైన మేనరిజమ్స్ ఉండగా..సుందర్ మాత్రం పవన్ బాడీ లాంగ్వేజ్, డాన్స్ అండ్ డైలాగ్ మూమెంట్స్ ని హీరో శింబుతో మక్కీకి మక్కీ వాడించేశారు.

ఈ సినిమాలో సమంత పాత్ర లో మేఘ ఆకాష్, ప్రణీత పాత్రలో కేథరిన్, పవన్ కళ్యాణ్ తాత గా నటించిన బొమన్ ఇరానీ పాత్రలో నాజర్, ఇక ఈ సినిమాకు ఆయువు పట్టు అయిన నదియా పాత్ర లో రమ్యకృష్ణ నటిస్తున్నారు. రమ్యకృష్ణ భర్తగా ప్రభు రావు రమేష్ పాత్రను పోషించారు. అహల్య ఎపిసోడ్ పవన్ డాన్స్ మూమెంట్స్ తో ఈ టీజర్ ను చూసిన తెలుగు ప్రేక్షకులు అత్తారింటికి దారేది రీమేక్ కాదు డబ్బింగ్ చూసినట్టుంది అంటూ వ్యాఖ్యానించారు.